సూర్యాపేట(రూరల్) : మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ మహాదేవ నామేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన వారాహి నవరాత్రోత్సవాలు శుక్రవారం రాత్రితో ముగిసినట్లు దేవాలయ అర్చకులు మునగలేటి సంతోష్ శర్మ తెలిపారు.జూన్ 26 నుంచి ఈ నెల 4 వరకు ప్రతి రోజు అమ్మవారికి అభిషేకం,మహిళా భక్తులచే కుంకుమ పూజలు నిర్వహించామన్నారు.శుక్రవారం సాయంత్రం వారహి హోమం నిర్వహించిన అనంతరం పూర్ణాహుతి,ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించామన్నారు.హైద్రాబాద్,విజయవాడ,ఖమ్మం,వైరా,మిర్యాలగూడ,నల్లగొండతో పాటు దూర ప్రాంతాల నుంచి ఉత్సవాలకు భక్తులు హాజరైనట్లు తెలిపారు.నవరాత్రోత్సవాల నిర్వాహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.