బిల్డింగ్ పర్మిషన్ లేకుండానే శ్రీ చైతన్య క్లాసులు…
కళ్ళు మూసుకున్న విద్యాశాఖ – ఎస్ ఎఫ్ ఐ..
నిజామాబాద్ అర్బన్, ప్రజాజ్యోతి, జూన్ 5 :
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పత్రిక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో బిల్డింగ్ పర్మిషన్ లేకుండానే సి బి ఎస్ ఈ పేరుతో క్లాసుల తరగతులను నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాఠశాలల్లో క్లాసులు జరుగుతున్న జిల్లా విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడం బాధాకరం అని అన్నారు. కార్పొరేట్ శ్రీ చైతన్య ప్రభుత్వ జీవోలను పట్టించుకోకుండా బిల్డింగ్ పర్మిషన్ లేకుండానే విద్యార్థుల తల్లిదండ్రులను మభ్య పెట్టడం సరికాదని అన్నారు. వెంటనే శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు హెచ్చరించారు.