వన మహోత్సవానికి డి ఎం డబ్ల్యూ ఓ దయానంద్, కిరణ్ గౌడ్
బోర్లం బాన్సువాడ ఆర్ సి జూలై 01 (ప్రజా జ్యోతి)
తెలంగాణ బొర్లం మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలలో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డి ఎం డబ్ల్యూ ఓ దయానంద్ , ఆర్ ఎల్ సి కిరణ్ గౌడ్ ప్రిన్సిపల్ ఎస్ ధనలక్ష్మి ,పాఠశాల బృందము మరియు విద్యార్థినీలు పాల్గొన్నారు. విద్యార్థినీలతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు, మరియు పాఠశాల తరగతులను పరిశీలించి విద్యార్థినిలకు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి గదులు పరిసరాలు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు . అనంతరం డి ఎం డబ్ల్యు ఓ దయానంద్ మాట్లాడుతూ విద్యార్థినిల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ పనిచేస్తున్న ప్రిన్సిపాల్ ధనలక్ష్మికి ఈ క్రెడిట్ దక్కుతుందని అన్నారు.