

33 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
ఆరుగురు నిందితులు అరెస్ట్
కరీంనగర్ బ్యూరో, జూన్ 27, (ప్రజాజ్యోతి)
కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పలు చోట్ల బైకులను చోరీ చేస్తున్న ఈ ముఠాను అరెస్ట్ చేయడంతో పాటు 33 ద్వి చక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం వివరాలను వెల్లడించారు. ఆరుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పుడుతున్నారని అనుమానస్పదంగా సంచరిస్తున్న వీరిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ముఠా గుట్టు రట్టయిందని తెలిపారు. రూ.12.27 లక్షల విలువైన బైకులను స్వాధీనం చేసుకోవడంలో కరీంనగర్ టూ టౌన్, సీసీఎస్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారని తెలిపారు. వీరిపై ఆరు పోలీస్టేషన్లలో 22 కేసులు నమోదయ్యాయని సీపీ గౌస్ ఆలం వెల్లడించారు. కరీంనగర్ వన్ టౌన్ స్టేషన్ లో 22 6 కేసుల్లో 11 బైకులు, కరీంనగర్ టూ టౌన్ స్టేషన్ లో 8 కేసుల్లో 9 బైకులు, కరీంనగర్ త్రీ టౌన్ పరిధిలో ఒక కేసులో ఒక బైక్, కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో 2 కేసుల్లో 2 బైకులు, కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో 3 కేసుల్లో 3 బైకులు, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీస్ స్టేషన్ లో 2 కేసుల్లో 2 బైకులు, వివరాలను లేని బైకులు ఐదు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో మహబూబ్ నగర్ జిల్లా వెంకిచర్లకు చెందిన పంతులు నవీన్ (24), కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చొక్కరావుపల్లికి చెందిన పెంటి బాలు(24), రాజన్న సిరిసిల్ల జిల్ల చందుర్తి మండలం మల్యాకు చెందిన పెద్ది నాగరాజు (29), పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కేశనపల్లికి చెందిన చిందం సాయి ప్రసాద్ (24), కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లింగంపల్లికి చెందిన తోట మధు (28), రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు చెందిన కుంబాల సురేష్ (35)లు ఉన్నారని సీపీ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు సృజన్ రెడ్డి, శ్రీనివాస్, కోటేశ్వర్, జాన్ రెడ్డిలు పాల్గొన్నారు. బైకుల దొంగల ముఠాను పట్టుకున్న పోలీసు యంత్రాంగానికి సీపీ గౌస్ ఆలం రివార్డులు అందజేసి అభినందించారు.
