రోగికి పునర్జన్మం
జీవం పోసిన ప్రెస్టేజ్ హాస్పిటల్ వైద్యులు
ఆనందం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు
వైద్యుల రుణం తీర్చుకోలేనిది
నిజామాబాద్ అర్బన్, ప్రజాజ్యోతి, జూన్ 3:
ప్రెస్టేజ్ ఆసుపత్రి లో రోగికి పునర్జన్మం ప్రసాదించారు.
మంగళవారం ప్రెస్టేజ్ ఆసుపత్రిలో ప్రముఖ క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ ప్రతిమ రాజ్, నెఫ్రాలజీ వైద్యులు మోసిన్ లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు వెల్లడించారు. ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన నవీన్ (35) శరీరంలోని ప్రధానమైన అవయవాలైన కిడ్నీ, లివరు, ఊపిరితిత్తులు, గుండె, నాడీ వ్యవస్థ పనిచేయకపోవడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు.
కుటుంబానికి తానే బరువు బాధ్యతలు నిర్వర్తించే ఇంటి పెద్దమనిషి ఒకేసారి చావు బతుకుల వైపు పరుగులు తీస్తుండగా, చివరి నిమిషంలో కుటుంబ సభ్యులు ప్రెస్టేజ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.
ప్రెస్టేజ్ ఆసుపత్రి వైద్యులు రోగి చికిత్స పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ చూపి వైద్య పరంగా ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యం అందించారు. వైద్యులు అందించిన సేవల పట్ల రోగి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. లక్షల ఒకరికి మాత్రమే నరాల బలహీనతకు సంబంధించిన గులియం బ్యారీ సిండ్రోమ్ అనే వ్యాధి సోకుతుందని నవీన్ అనే పేషెంట్ కు సోకడం విచారకరమని వైద్యులు వాపోయారు. తో పాటు గుండె కిడ్నీ నరాల బలహీనత వంటి ప్రధానమైన అవయవాలతో బాధపడుతున్న నవీన్ ను మెరుగైన వైద్య చికిత్సలు అందించారు. డయాలసిస్‌తో కిడ్నీ ఫంక్షనింగ్ చేయడంతో పాటు నరాల బలహీనత, హార్ట్ ,కిడ్నీ, లివర్ ఫంక్షన్ ను మెరుగుపరచామని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో పూర్తి ఆరోగ్యంతో ఈరోజు సాయంత్రం డిశ్చార్జ్ చేయడం జరిగిందని ప్రతిమ రాజ్ పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆసుపత్రి వైద్యులు వినోద్ డైరెక్టర్ కైఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.