వరంగల్:: శ్వేతార్క గణపతికి మామిడిపళ్ళ రసంతో అభిషేకం
ఖాజీపేట లోని స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయ దివ్య క్షేత్రంలో శుక్రవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వామివారికి 108 లీటర్ల మామిడిపళ్ళ రసంతో విశేష అభిషేకం నిర్వహించడం జరిగింది. బ్రహ్మశ్రీ అయినవోలు రాధాకృష్ణ శర్మ, అయినవోలు సాయి కృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి అభిషేకాన్ని తిలకించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యకర్తలు సీనమ్మ, రజిత, సబితా, ఉమాదేవి, అరుణాదేవి, వెంకట సాయి, తేజ, చందు, సదానందం, శ్రీనివాస్, చొక్కారపు శ్రీనివాస్, బాపురావు, దేవాలయ సిబ్బంది మేనేజర్ లక్క అసిస్టెంట్ మేనేజర్ దుర్గం సుదీర్ పిఆర్వో మని శ్రీనివాసరావు, పద్మ తదితరులు పాల్గొన్నారు. పూజ అనంతరం భక్తులందరికీ అభిషేకం చేసిన మామిడిపళ్ళ రసాన్ని తీర్థ ప్రసాదం గా వితరణ చేయడం జరిగింది. అనంతరం అన్నపూర్ణ భవన్ లో భక్తులందరికీ అన్నదానం నిర్వహించారు.