ఫెర్టిలైజర్స్ డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి……
రాష్ట్ర ఫర్టిలైజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరిశెట్టి మునీందర్
తుంగతుర్తి, ఏప్రిల్ 21,(ప్రజా జ్యోతి):
ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్ మరియు సీడ్స్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరిశెట్టి మునీందర్ అన్నారు. మండల కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో ఆ సంఘం డివిజన్ అసోసియేషన్ అధ్యక్షులు పూసపెల్లి యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన డివిజన్ డీలర్ల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గతంలో డీలర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశామని, డీలర్లంతా ఏకతాటిపై ఉండి సమస్యల సాధన కోసం ముందుండాలని, సంఘం బలోపేతం కోసం కృషి చేయాలని, డీలర్లకు సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జూరి రవీందర్, రాష్ట్ర అసోసియేషన్ సభ్యులు మొరిశెట్టి యోగి, డివిజన్ గౌరవ అధ్యక్షులు గుండా ఈశ్వరయ్య, డివిజన్ ప్రధాన కార్యదర్శి సోమ వెంకన్న, డివిజన్ అసోసియేషన్ బాధ్యులు, మండల అసోసియేషన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు డీలర్లు పాల్గొన్నారు.