ఏడాదిన్నర అయిందయ్యా… పరిహారం చెల్లించరూ…!
తహసిల్దార్ కు బిఎల్ఓ ల వినతి
మిర్యాలగూడ, ఏప్రిల్ 21, ( ప్రజాజ్యోతి ): గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసినం… కుటుంబ సర్వే నిర్వహించినం… ఏడాదిన్నర దాటింది మా పరిహారం ఇప్పించండి అయ్యా అంటూ… సోమవారం పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో (బిఎల్ఓ)బూత్ లెవెల్ ఆఫీసర్లయిన అంగన్వాడి టీచర్లు తహసీల్దార్ కె.హరిబాబుకు వినతిపత్రం అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు జరిగి నెలలు గడిచినా, అధికారులకు అనేకమార్లు విన్నవించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కుటుంబ సర్వే నిర్వహిస్తే ఒకొక్కరికి పది వేల రూపాయల చొప్పున ఇస్తామని అధికారులు చెప్పారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోయారు. ఇప్పటికైనా అధికారుల స్పందించి తమకు రావాల్సిన పరిహారం అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సిఐటియు) జిల్లా అధ్యక్షురాలు బొందు పార్వతి, ప్రధాన కార్యదర్శి ఐ. సైదమ్మ, నాయకులు శ్రీదేవి, అహ్మదీబెగం, పి.వరలక్ష్మి, ఏం. అరుణ, మంగమ్మ, స్వరాజ్యం లు పాల్గొన్నారు.