యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు, దర్శక దిగ్గజం రాజమౌళికి ఉన్న అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తారక్ ను రాజమౌళి అమితంగా ఇష్టపడతారు. సమయం వచ్చినప్పుడల్లా తారక్ ను పొగడటానికి రాజమౌళి ఏమాత్రం సందేహించరు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ను రాజమౌళి మరోసారి ఆకాశానికి ఎత్తేశారు. ‘ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ జపాన్ లో విడుదల కాబోతోంది. ఈ డాక్యుమెంటరీ ప్రచారంలో భాగంగా జపాన్ కు వెళ్లిన రాజమౌళి అక్కడి మీడియాతో మాట్లాడుతూ తారక్ పై ప్రశంసలు జల్లు కురిపించారు.
‘కొమురం భీముడో’ వంటి కష్టమైన పాటను చిత్రీకరించడం ఎన్టీఆర్ వల్లే తనకు సులభమయిందని రాజమౌళి చెప్పారు. ఆ పాటలో తారక్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అన్నారు. శరీరంలోని అణువణువులో తారక్ హావభావాలను పలికించాడని కితాబునిచ్చారు. తారక్ అద్భుతమైన నటుడని ప్రశంసించారు. ఆ పాట వెనుక కొరియోగ్రాఫర్ ప్రతిభ కూడా ఉందని అన్నారు.
తారక్ విషయానికి వస్తే… బాలీవుడ్ లో సత్తా చాటేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ‘వార్-2’ సినిమాలో తారక్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయిక. ఆగస్ట్ 14న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది