7 అడుగుల కండక్టర్కు సీఎం రేవంత్ రెడ్డి బంపరాఫర్

V. Sai Krishna Reddy
1 Min Read

ఆరు అడుగుల బస్సులో ఏడు అడుగుల పొడవుతో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగి అమీన్‌ అహ్మద్‌ అన్సారీ గత వారం రోజులుగా నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాడు. బస్సు ఎత్తుకు మించి పొడవు ఉండటంతో విధులు నిర్వహించడం సవాల్‌గా మారిందని, తరచూ బస్సుల్లో రోజూ సగటున 5 ట్రిప్పుల్లో 10గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోందని వాపోయాడు. 195 సెం.మీ. ఎత్తుండే బస్సు లోపల 214 సెం.మీ. పొడవున్న తాను గంటల తరబడి తల వంచి ప్రయాణిస్తుండటం వల్ల మెడ, వెన్నునొప్పి, నిద్రలేమితో హాస్పిటల్స్చుట్టూ తిరగాల్సి వస్తోందని తన గోడు విన్నవించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో అతడికి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ప్రయాణికులు సైతం విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలో ఏడడుగుల కండక్టర్‌ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అతడికి ఆర్టీసీలోనే వేరే ఉద్యోగం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ విషయాన్ని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కండక్టర్‌కు వేరే ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను మంత్రి పొన్నం ఆదేశించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *