ఒకేసారి ఇద్దరు యువతులతో ప్రేమాయణం.. ఇద్దరినీ పెళ్లాడిన యువకుడు!

V. Sai Krishna Reddy
1 Min Read

పక్కపక్క గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులను ఒకేసారి ప్రేమించిన యువకుడు.. వారిద్దరినీ ఒకేసారి వివాహం చేసుకున్నాడు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లింగాపూర్ మండలం ఘుమనూర్ గ్రామానికి చెందిన సూర్యదేవ్.. పక్కపక్క గ్రామాలకు చెందిన యువతులు లాల్‌దేవి, జల్కర్‌దేవిలను ఒకేసారి ప్రేమించాడు. కొంతకాలంగా ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. విషయం తెలిసిన గ్రామస్థులు, ఆదివాసీ పెద్దలు కలిసి ఇరు కుటుంబాలతోపాటు యువతులతోనూ మాట్లాడారు. యువతులు ఇద్దరూ సూర్యదేవ్‌ని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించారు. ముగ్గురం కలిసే జీవిస్తామని స్పష్టం చేశారు. దీంతో వారికి వివాహం చేయాలని నిర్ణయించారు. గురువారం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం వారి వివాహం ఘనంగా జరిపించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *