బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత ఫిర్యాదు చేయడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్‌కు, కార్పొరేటర్‌కు హనీమూన్ నడుస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలే కేసుకు కారణం.
బీఆర్ఎస్ నేత, ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత ఎల్‌బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సుధీర్ రెడ్డిపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ తో హస్తినాపురం కార్పొరేటర్ కు హనీమూన్ నడుస్తుందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై తాజాగా కేసు నమోదైంది.