ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ
1-భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 205 ద్వారా సంప్రాప్తించిన అధికారానికి లోబడి, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తదుపరి ఖర్చుల కోసం గ్రాంట్ల డిమాండ్ల అనుబంధ ప్రకటన ఆమోదం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
గత ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతల్లో అత్యవసర ప్రాతిపధికన రూ.6373.23 లక్షల వ్యయంతో నామినేషన్ పద్దతిలో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన 517 పనుల పరిపాలనా అనుమతులను దృవీకరించేందుకు చేసిన..
ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే
1.ఆర్థిక శాఖ
1-భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 205 ద్వారా సంప్రాప్తించిన అధికారానికి లోబడి, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తదుపరి ఖర్చుల కోసం గ్రాంట్ల డిమాండ్ల అనుబంధ ప్రకటన ఆమోదం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
2.ఉన్నత విద్యా శాఖ:
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీ (VVITU) ని బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరీ కింద ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపనకు అనుమతి ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల (స్థాపన, నియంత్రణ) చట్టం 2016 (చట్టం నం. 3 ఆఫ్ 2016) షెడ్యూల్‌ను సవరించడానికి ముసాయిదా బిల్లు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. విద్యా ప్రణామాణ మెరుగుకు, ఉన్నత విద్య అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు, ఆర్థిక ప్రగతిని, పరిశోధనాత్మక సామర్థ్యాలను పెంచేందుకు ఈ సవరణ దోహదపడుతుంది.
3.పాఠశాల విద్యా శాఖ:
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 ను ప్రవేశపెట్టడానికి రూపొందించిన ముసాయిదా బిల్లు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. పిల్లల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం, 2009 (RTE చట్టం, 2009), దాని క్రింద రూపొందించబడిన నియమాల ప్రకారం మునిసిపల్ పరిమితులు, ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఎ) రేట్లు, రవాణా సౌకర్యాల లభ్యత ఆధారంగా ఆవాసాలను కేటగిరీలు I, II, III, IVలుగా వర్గీకరించడం ద్వారా అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సమాన అవకాశాలు నిర్ధారించడానికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలను నియంత్రించేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది.
4.పురపాల, పట్టణాభివృది శాఖ:
CRDA ప్రాంతంలోని వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపుల సమీక్షకు సంబంధించి మంత్రుల బృందం చేసిన సిఫార్సులను ఆమోదించడానికి, అమరావతి భూ కేటాయింపు నియమ, నిబంధనలు, 2017 ప్రకారం మంత్రుల బృందం చేసిన సిఫార్సులపై అవసరమైన చర్యలు తీసుకోవడానికి కమిషనర్, APCRDA కి అనుమతి ఇవ్వడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
5.పురపాల, పట్టణాభివృది శాఖ:
-(ఎ) రూ.390.06 కోట్ల విలువైన APTRANSCO 400KV DC లైన్ (18 KM) మరియు PGCIL 400KV DC లైన్ల (20 KM) రీరూటింగ్ యొక్క బ్యాలెన్స్ పనులకు మరియు రూ.1082.44 కోట్ల విలువైన N10 నుండి N13 – E1 జంక్షన్ వరకు UG కేబుల్స్ ద్వారా 220KV EHV లైన్ల రీరూటింగ్ బ్యాలెన్స్ పనులకు సంబందించి పరిపాలనా అనుమతుల నిమిత్తం
-(బి) ఈ పనులలో రూ.390.06 కోట్ల పనులను అంచనా నిర్మాణ వ్యయం కంటే 8.99% అదనపు మొత్తానికి మెస్సర్స్ పివిఆర్ కన్‌స్ట్రక్షన్స్, హైదరాబాద్, మెస్సర్స్ కె.రామ చంద్రరావు ట్రాన్సుమిషన్ & ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ సంయుక్తంగా చేపట్టేందుకు అనుమతిని నిస్తూ, అలాగే బెంగళూరులోని మెస్సర్స్ బిఎస్‌ఆర్‌ఐన్‌ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్, బెంగుళూరు వారికి రూ.1082.44 కోట్లకు అంచనా వ్యయం కంటే 8.98% ఎక్కువ శాతానికి అప్పగించేందుకు చేసిన ప్రతిపాధనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
6.పురపాల, పట్టణాభివృది శాఖ:
-ప్యాకేజీ XXXXII క్రింద రూ.834.46 కోట్లతో చేపట్టనున్న రోడ్లు నిర్మాణం, వరద నీటి కాలువ, జాతీయ రహదారి-16 వరకు E13 రోడ్డు విస్తరణకై ఏకమొత్తంగా 2 సంవత్సరాల Defect Liability Period తో పరిపాలనా అనుమతి ఆమోదం కోసం ADCL, విజయవాడ వారు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
7.పురపాలక, పట్టణాభివృది శాఖ:
-ప్యాకేజీ XXXXI క్రింద రూ.307.59 కోట్లతో చేపట్టనున్న రోడ్లు నిర్మాణం, వరద నీటి కాలువ, పాత జాతీయ రహదారి మంగళగిరి వరకు E15 రోడ్డు విస్తరణకై ఏకమొత్తంగా 2 సంవత్సరాల Defect Liability Period తో పరిపాలనా అనుమతి ఆమోదం కోసం ADCL, విజయవాడ వారు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.