గిర్ని బావి వద్ద కాల్పులు జరగలేదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ జిల్లా కొమ్మాల జాతర సందర్బంగా గిర్నిబావి ప్రాంతంలో ప్రభ బండ్లును వరుస క్రమంలో తరలి వెళ్లే క్రమంలో కొంత మంది వ్యక్తులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా సదరు వారు ముందుకు వెళ్లే క్రమంలో పోలీసులకు ప్రభ బండ్లను తరలించే వారి మధ్య తోపులాట మాత్రమే జరిగింది. అంతేకాని ఈ సంఘటన లో ఎలాంటి పోలీస్ కాల్పులు జరగలేదు. కొన్ని ప్రచార మధ్యామాల్లో ఈ సంఘటన లో కాల్పులు జరిగినట్లుగా ప్రజలను ఆందోళన కలిగించే రీతిలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా ప్రజలను ఆందోళన కలిగించే రీతిలో వార్తలు సామాజిక మధ్యమాల్లో పోస్టులు పెట్టిన, వార్తలు రాసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు.