తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎదురయ్యే నష్టాలపై చర్చించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆహ్వానించారు. ఈ నెల 22న జరగనున్న ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలకు ఆహ్వానాలు పంపారు. ఈ పునర్విభజన దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు ఉద్దేశించిన సమావేశానికి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో సీఎం రేవంత్‌ను తమిళనాడు మంత్రి టీకే నెహ్రూ ఆధ్వర్యంలోని డీఎంకే ప్రతినిధి బృందం కలిసి, స్టాలిన్ తరఫున ఈ ఆహ్వానం అందించింది. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టం చర్చించేందుకు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులతో ఈ నెల 22న స్టాలిన్ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.