వ్యాపారులకు షాకివ్వనున్న ప్రభుత్వం.. ఇక UPI, RuPay లావాదేవీలపై ఛార్జీలు

V. Sai Krishna Reddy
2 Min Read

డిజిటల్ చెల్లింపు పరిశ్రమలో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అనేది కస్టమర్లు తనకు చేసే రియల్ టైమ్ చెల్లింపు కోసం ఒక వ్యాపారి లేదా దుకాణదారుడు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం యూపీఐ, RuPay డెబిట్ కార్డ్ చెల్లింపులపై ఎటువంటి ఎండీఆర్‌ వర్తించదు. ఈ చెల్లింపులు నేషనల్ పేమెంట్స్ యూపీఐ విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది. యూపీఐపై MDR (Merchant Discount Rate)ఛార్జీని తిరిగి అమలు చేయడానికి ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. ఈ ఛార్జీని యూపీఐ పై మాత్రమే కాకుండా RuPay డెబిట్ కార్డులపై కూడా విధించడానికి సిద్ధమవుతోంది. ఇది జరిగితే, డిజిటల్ చెల్లింపులు ప్రభావితం కావచ్చు. ఈ ఛార్జీని ప్రభుత్వం 2022 సంవత్సరంలో మాఫీ చేసింది. కానీ, ఇప్పుడు పెద్ద వ్యాపారులు దానిని భరించగల సామర్థ్యం ఉందని ఫిన్‌టెక్ కంపెనీలు చెబుతున్నాయి. అందుకే అటువంటి వ్యాపారులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని విశ్వసనీయ సమాచారం. యూపీఐ లావాదేవీలు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల, పెద్ద వ్యాపారులు కూడా కొంత ఖర్చులను భరించాలని ప్రభుత్వం కోరుకుంటోంది. 2025-26 సంవత్సరానికి బడ్జెట్‌లో ప్రభుత్వం చెల్లింపు సబ్సిడీని రూ.3,500 కోట్ల నుండి రూ.437 కోట్లకు తగ్గించింది. దీని కారణంగా బ్యాంకులు నష్టపోతున్నాయి. 2022 సంవత్సరానికి ముందు వ్యాపారి కొంత రుసుము చెల్లించాల్సి వచ్చింది. దీనిని మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR) అని పిలుస్తారు. లావాదేవీ చేయడానికి
బదులుగా ఈ రుసుమును బ్యాంకుకు ఇచ్చారు. మీడియా నివేదికల ప్రకారం, బ్యాంకులు ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన ఇచ్చాయని ఒక బ్యాంకర్ చెప్పారని బ్యాంకర్లు చెబుతున్నారు. వార్షిక GST టర్నోవర్ రూ. 40 లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యాపారులకు MDR వర్తింపజేయాలని సూచించింది. ప్రభుత్వం టైర్డ్ ప్రైసింగ్ వ్యవస్థను కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ వ్యవస్థ కింద పెద్ద వ్యాపారులు అధిక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో చిన్న వ్యాపారులు తక్కువ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. యూపీఐ ఎండీఆర్‌ విధించాలనే ప్రతిపాదనను పరిశ్రమ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వానికి పంపాయి. ఇప్పుడు ఈ విషయాన్ని ఆ శాఖ పరిశీలిస్తోంది. ఇది జరిగితే ఎండీఆర్‌ మరోసారి తిరిగి వస్తుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *