దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, ఐటీ స్టాక్స్ లో అమ్మకాలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 72 పాయింట్లు కోల్పోయి 74,029 వద్ద ముగిసింది. నిఫ్టీ 27 పాయింట్లు నష్టపోయి 22,470 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 87.21గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.38%), టాటా మోటార్స్ (3.18%), కోటక్ బ్యాంక్ (2.45%), బజాజ్ ఫైనాన్స్ (1.77%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.60%).
టాప్ లూజర్స్
ఇన్ఫోసిస్ (-4.28%), టెక్ మహీంద్రా (-2.80%), నెస్లే ఇండియా (-2.43%), టీసీఎస్ (-1.99%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.91%)