అన్నమయ్య జిల్లా రాయల్పాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం వేకువజామున ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.