వెల్ నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవ వేడుకలు
ప్రజాజ్యోతి నిజామాబాద్ ప్రతినిధి:
నిజామాబాద్ నగరంలోని
వెల్ నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే పారిశుధ్య కార్మికులను హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ కుమార్ ఆధ్వర్యములో కేక్ కట్ చేసి,పారిశుధ్య కార్మికులకు చీరాల పంపిణి చేసారు . ఈ సందర్బంగా బోదు అశోక్ మాట్లాడుతూ సమాజంలో మహిళలు, పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాలలో పనిచేస్తూ దూసుకుపోతున్నారన్నారు. మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని, మహిళల పాత్ర లేనిదే సమాజ మనుగడ ముందుకు సాగదని పేర్కొన్నారు. మహిళలు తమ వృత్తితో పాటు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలని సూచించారు. మహిళలు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సక్రమంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఎం.డిలు తాళ్ల సుమన్ గౌడ్, అసద్ ఖాన్, వివేకానంద రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.