ఫైనల్ గా స్ట్రీమింగ్ కి వచ్చేసిన “మనమే

V. Sai Krishna Reddy
1 Min Read

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ఆయేషా ఖాన్ కీలక పాత్రలో నటించిన చిత్రాన్ని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం గత ఏడాది జూన్ లో రిలీజ్ కి వచ్చింది. కానీ అప్పుడు నుంచి ఓటిటి రిలీజ్ కి నోచుకోలేదు. దీనితో అప్పుడు నుంచి ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఆడియెన్స్ కి ఫైనల్ గా నేడు గుడ్ న్యూస్ వచ్చేసింది.

ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకోగా ఈరోజు మార్చ్ 7 నుంచే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. సో ఈ ఫ్యామిలీ డ్రామాని అపుడు మిస్ అయ్యి చూడాలి అనుకునే వారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఇక ఈ చిత్రానికి హీషం అబ్దుల్ వహద్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మాణం వహించారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *