రాష్ట్రంలో భిన్న వాతావరణం

V. Sai Krishna Reddy
0 Min Read

రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొన్నది. ఉదయం 11, సాయంత్రం 4 గంటల తర్వాత చలిగాలులు వీస్తున్నాయి. 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని పేరొంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 34.6-39.3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. శుక్ర, శనివారాల్లోనూ ఎండలు అధికంగా ఉంటాయని తెలిపింది. జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *