ఎస్ఎల్బీసీ సొరంగం (SLBC Tunnel) లోపల చిక్కుకున్నవారి జాడ గుర్తించేందుకు 14వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ రెస్క్యూ బృందాలను నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటకు రప్పించి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్‌ను రంగంలోకి దించారు. ఎస్ఎల్బీసీ సొరంగం (SLBC Tunnel) లోపల చిక్కుకున్నవారి జాడ గుర్తించేందుకు 14వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ రెస్క్యూ బృందాలను నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటకు రప్పించి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్‌ను రంగంలోకి దించారు. శుక్రవారం ఉదయం 7.15 గంటలకు క్యాడవర్ డాగ్స్ బృందం టన్నెల్లోకి వెళ్లింది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు తవ్వేందుకు అవసరమైన అన్ని సామాగ్రితో 110 మందిని సొరంగంలోకి లోకో మోటర్ తీసుకెళ్లింది. వారితోపాటు డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా, ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ డాక్టర్ హర్షిత్ బెల్జియం కూడా వెళ్లారు. కాగా, మ్యాల్నోయిస్ బ్రీడ్‌కు చెందిన క్యాడవర్ డాగ్స్ 15 ఫీట్ల లోపల ఉన్నా మనుషుల జాగను గుర్తించగలవు. అన్వేషణ అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు టన్నెల్ నుంచి బయటకు రానున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోశ్ బాదావత్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.