ఓ డాక్టర్ బాబు గారు ఆసుపత్రికి వచ్చే రోగులకు తాను టిప్పు సుల్తాన్ వారసుడినని చెప్పేవాడు. అంతేకాకుండా టిప్పు సుల్తాన్ట్రస్ట్‌కు తాను ఛైర్మన్‌నని అందరితో పరిచయాలు పెంచుకునేవాడు. ట్రస్ట్ నుంచి తనకు రూ.700 కోట్లు రావాల్సి ఉందని. ఆ డబ్బు వస్తే జనగామలో ప్రజల కోసం వైద్య కళాశాల ఏర్పాటు చేస్తానని అందరితో చెప్పేవాడు. ఇతగాడి మాయమాటలు నమ్మిటిప్పు సుల్తాన్ వారసుడిగా చెప్పుకుంటూ ఓ డాక్టర్ పలువురిని బురిడీ కొట్టించి కోట్ల రూపాయలు దండుకున్నాడు. తాను టిప్పు సుల్తాన్ మెమోరియల్ ట్రస్ట్ ఛైర్మన్ అని నమ్మబలికి ఏకంగా రూ.5.56 కోట్లు వసూలు చేశాడు. ప్రభుత్వ కాంట్రాక్టులు, ఉద్యోగ నియామకాలు, వైద్య ఒప్పందాల పేరిట నకిలీ హామీలు ఇచ్చి ఎంతో మందిని మోసం చేశాడు. చివరికి అసలు నిజం బయటపడటంతో ఆగ్రహించిన జనాలు చితకబాది పోలీసులను అప్పగించారు. ఈ విచిత్ర సంఘటన జనగామ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..తమిళనాడులోని కుంభం గ్రామానికి చెందిన అబ్దుల్ రహీమ్ సుల్తాన్రాజ అనే వ్యక్తి 2020లో జనగామ పట్టణంలో కేకే ఆసుపత్రిని ప్రారంభించాడు. తన ఆసుపత్రికి వచ్చే రోగులకు తాను టిప్పు సుల్తాన్ వారసుడినని చెప్పేవాడు. అంతేకాకుండా టిప్పు సుల్తాన్ట్రస్ట్‌కు తాను ఛైర్మన్‌నని అందరితో పరిచయాలు పెంచుకునేవాడు. ట్రస్ట్ నుంచి తనకు రూ.700 కోట్లు రావాల్సి ఉందని. ఆ డబ్బు వస్తే జనగామలో ప్రజల కోసం వైద్య కళాశాల ఏర్పాటు చేస్తానని అందరితో చెప్పేవాడు. ఇతగాడి మాయమాటలు అక్కడికి వచ్చే జనాలు కూడా నిజమేనని నమ్మేవారు. కాస్త డబ్బు, పలుకుబడి ఉన్నవారి వద్ద కాస్త ఎక్కువగా డప్పుకొట్టుకునే వాడు. అలా ఓ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్‌కు మెడికల్ కాలేజీ కాంట్రాక్టు ఇప్పిస్తానని చెప్పి రూ.1.17 కోట్లు దండుకున్నాడు. మరో వ్యక్తిని ESI ఆసుపత్రులలో ఉద్యోగ నియామకాలు ఇప్పిస్తానని చెప్పి రూ.14.75 లక్షలు వసూలు చేశాడు. వైద్య పరికరాల పంపిణీ చేస్తానని స్థానిక వ్యాపారవేత్త వద్ద రూ.5 లక్షలు, హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్‌కు రూ.1.7 కోట్లు, మరో బాధితుడి వద్ద రూ.50 లక్షలు దండుకుని ముఖం చాటేశాడు. అంతటితో ఆగకుండా 2024లో కరీంనగర్కు చెందిన సీహెచ్అనిల్ వద్ద రూ.2 కోట్లు.. ఇలా అందరి వద్ద కలిపి రూ.5.56 కోట్లు వసూలు చేసి 8 నెలల క్రితం జనగామాలో బిచానా ఎత్తేశాడు.
ఇదే మాదిరి స్థానిక ఎలక్ట్రికల్గుత్తేదారు వసీం అక్తర్వద్ద రూ.1.17 కోట్లు తీసుకుని నెల రోజుల్లోగా ఇస్తానని చెప్పాడు. తీరా డబ్బు కోసం వస్తే అక్తర్ఊరొదిలి వెళ్లిపోయాడని తెలుసకుని.. జనగామ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో వైద్యుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కేకే ఆసుపత్రికి సుల్తాన్రాజ వచ్చినట్లు పోలీసులకు సమాచారం రావడంతో సీఐ దామోదర్ రెడ్డి సిబ్బందితో వెళ్లి అతడిని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. జనగాం పోలీసు ఇన్‌స్పెక్టర్ పి దామోదర్ రెడ్డి నేతృత్వంలోని దర్యాప్తులో సుల్తాన్ రాజ్ అర్హత కలిగిన వైద్యుడా లేదా నకిలీ వైద్యుడా అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు