పర్వతగిరి, మార్చి 03 (ప్రజాజ్యోతి):
మండలంలోని రావూరు గ్రామం నుండి కల్లెడ వరకు ఎండిపోయిన ఆకేరు వాగు పరివాహక పంటలను రైతులతో కలిసి మాజీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పరిశీలించారు. ఆకేరు వాగుపై ఉన్న చెక్ డ్యామ్ ఎండిపోయి ఆ గ్రామ రైతులు సాగు నీరు రాక చేతికి వచ్చిన పంట ఎండి పోతుందని చేసేది ఏమి చావే మాకు శరణ్యం అని నీరు కోసం బిక్కు బిక్కు మంటూ ఎదురు చూస్తున్న రైతులు ఫోన్ చేసి తమ గోడు వెళ్ళబోసుకోగా వెంటనే స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామానికి వచ్చి వారి సమస్య తెలుసుకొని సంబంధించిన అధికారులతో మాట్లాడి నీళ్లు వచ్చేలాగా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అధికారంలో ఉన్న కరువు విలయతాండవం చేస్తుందని అన్నారు.వర్ధన్నపేట నియోజకవర్గం లో ఎండాకాలం కూడా చెరువులు మత్తడి పడేవని కాంగ్రెస్ వస్తేనే కష్టాలు వచ్చాయని అన్నారు.ఆకేరు వాగు చెక్ డ్యామ్ ఎప్పటికి నీటితో కళకళ లాడుతుండేదని ఈ చెక్ డ్యామ్ మీద కొత్తపల్లి, ల్యాబర్తి, బంధనపల్లి, కొత్తూరు, రోళకల్లు, రావూరు, పర్వతగిరి, కల్లెడ, అన్నారం,సోమారం జామస్థాన్ పురం, మడిపల్లి, గుర్తూరు రైతులు ఈ నీళ్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తూ సుమారు వేల ఎకరాల పంట సాగుతుందన్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి నీళ్లు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వరరావు, చింతపట్ల సోమేశ్వరరావు,మాజీ సర్పంచ్లు బండి సంతోష్ కుమార్ గౌడ్, మాడుగుల రాజు, గడ్డి యాకయ్య, కరిమిల్ల దుర్గారావు, అమడగాని రాజు,శంకర్, రెడ్యా,విజయ్,నరేష్, అమ్మిలాల్,బండి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.