గణపురం ప్రజాజ్యోతి ఫిబ్రవరి 01
కోట గుళ్ళ లో ముగిసిన శివరాత్రి మహోత్సవాలు
సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు..
కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో ఈనెల 26న ప్రారంభమైన శివరాత్రి మహోత్సవాలు 28 శుక్రవారంతో ముగిసినట్లు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. మూడు రోజులపాటు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని శివరాత్రి మహోత్సవాల నిర్వహణకు ఆలయ ధర్మకర్తలు, పోషకులు, నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు, జర్నలిస్టు సోదరులకు, పోలీస్, విద్యుత్, వైద్య శాఖ గణపురం గ్రామపంచాయతీ సిబ్బంది, తదితర అధికారులకు ఆలయానికి తరలివచ్చిన భక్తులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. గత 18 సంవత్సరాలుగా ఆలయ నిర్వహణలో చేదోడు వాదోడుగా ఉంటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.