గ్రామాల్లో ప్రజా ప్రభుత్వ పధకాలు విస్తృతంగా ప్రచారం చేయాలి..
* కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కమలాపురం రమేష్
ఆత్మకూరు, ఫిబ్రవరి 28 (ప్రజాజ్యోతి):
గ్రామాల్లో ప్రజా ప్రభుత్వ పధకాలు విస్తృతంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కమలాపురం రమేష్ తెలిపారు.
శుక్రవారం పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కటాక్ష పూర్, హౌస్ బుజుర్గ్, నీరుకుళ్ల, పెంచికల పేట గ్రామాలలోని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి, కావలసిన పనుల గురించి మరియు ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన చేసినందుకు ఆ గ్రామ ప్రజలు ప్రజా పాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కమలాపురం రమేష్, గూడెప్పాడు ఏఎంసి చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు, మండల సమన్వయ కమిటీ సభ్యులు పర్వతగిరి రాజు, కంచె రవి కుమార్, అంబటి రాజస్వామి, బోరిగం స్వామి, ఎంకతాళ్ళ రవీందర్, రేవూరి జయపాల్ రెడ్డి, ముద్దం సాంబయ్య, ఎండి గఫూర్, మార్క్ రజినికర్, ఉడుత మహేందర్, హర్షం వరుణ్ గాంధీ, ఏరుకొండ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.