బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావును ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు నాలుగు రోజులుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లేందుకు హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు.
దీంతో హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు పోలీసుల చర్యను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆయన వెంట మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.