ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

V. Sai Krishna Reddy
1 Min Read

147 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

5 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

2.61 శాతం పెరిగిన ఎం అండ్ ఎం షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల మధ్య ఉదయం మన మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి వెళ్లాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడింది.

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 147 పాయింట్ల లాభంతో 74,602కి పెరిగింది. నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 22,547కి పడిపోయింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 87.21గా ఉంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:

మహీంద్రా అండ్ మహీంద్రా (2.61%), భారతి ఎయిర్ టెల్ (2.55%), బజాజ్ ఫైనాన్స్ (1.65%), జొమాటో (1.37%), నెస్లే ఇండియా (1.34%).

టాప్ లూజర్స్:

సన్ ఫార్మా (-1.58%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.25%), టీసీఎస్ (-1.19%), టెక్ మహీంద్రా (-1.15%), ఏషియన్ పెయింట్ (-1.04%).

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *