దేశీయ స్టాక్ మార్కెట్లను మరో బ్లాక్ మండే కుప్పకూల్చింది. ట్రంప్ టారిఫ్ భయాలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ ఒక్కరోజే దాదాపు రూ. 4 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరయింది.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 856 పాయింట్లు నష్టపోయి 74,454కి పడిపోయింది. నిఫ్టీ 242 పాయింట్లు కోల్పోయి 22,553 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మరో 4 పైసలు క్షీణించి రూ. 86.72 వద్ద ముగిసింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (1.58%), కోటక్ బ్యాంక్ (0.64%), మారుతి (0.25%), నెస్లే ఇండియా (0.24%), ఐటీసీ (0.21%).
టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-3.32%), జొమాటో (-3.32%), టీసీఎస్ (-2.93%), ఇన్ఫోసిస్ (-2.81%), భారతి ఎయిర్ టెల్ (-2.29%)