వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. ఈ రోజు సాయంత్రం విజయవాడ లబ్బీపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్‌లో జరిగే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించనున్నారు.
ఈ రోజు సాయంత్రం 4.20 గంటలకు బెంగళూరు యలహంక నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి వైఎస్ జగన్ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 4.40 గంటలకు చేరుకుంటారు. 5.25 గంటలకు విమానంలో బయలుదేరి 6.25 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.55 గంటలకు విజయవాడ లబ్బీపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్‌కు చేరుకుంటారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 7.30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి జగన్ చేరుకుంటారు