బాలల హక్కులు, బాల్య వివాహ చట్టాలపై అవగాహనా సదస్సు ను నిర్వహించారు. గురువారం వరంగల్ రూరల్ జిల్లా కేంద్రం లో గల (కేజీబివి) కస్తూరి భా గాంధీ బాలికల విద్యాలయం మరియు జూనియర్ కళాశాలలో షేర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల హక్కులు, వివాహ చట్టాలు పైన అవగాహనా కార్యక్రమం చేపట్టండం జరిగింది. ఈ అవగాహనా సదస్సులో (జస్ట్ ఫర్ రైట్స్ చిల్డ్రన్) వరంగల్ మరియు హనుమకొండ షేర్ ఎన్జీఓ కో – ఆర్డినేటర్ తోట శిరీష మాట్లాడుతూ.. బాలలు ఎదురుకుంటున్న సమస్యలు ముఖ్యం గా బాల్య వివాహాలు, బాలకార్మికులు, బడి మానివేసిన పిల్లలు, బాలలపై లైంగిక వేధింపులు మరియు అక్రమ రవాణా మొదలగు సమస్యలు వాటి పరిణామాలు వివరించారు. వాటికి సంబదించిన చట్టాలను పిల్లలకు తెలియ చెప్పటం జరిగింది. నల్లబెల్లి ఎస్ఎచ్ఓ గోవర్ధన్ మాట్లాడుతూ.. పిల్లలు అన్ని రంగాలలో ముందు ఉండాలని దాని కోసం చదువు పైన ఇష్టం పెంచుకొని వారు ఆ దిశగా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి అన్నారు. ఐసిపిఎస్ సుమన్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ బాలల హక్కుల ఒడంబడిక ప్రకారం బాలలకు హక్కులను అనగా జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, పాల్గొనే హక్కు,అభివృద్ధి చెందే హక్కులను వివరిస్తూ బాధ్యతలను గురించి వివరించారు. హక్కులకు భంగం కలిగి నప్పుడు బాలలకు ఉన్నా చట్టల ద్వారా రక్షణ పొందాలి అని చెప్పారు. అంగన్వాడీ సూపర్ వైసర్ అరుణ మాట్లాడుతూ.. సమస్యలు వచ్చిన వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, కానీ 100 గాని షేర్ ఎన్జీఓ వారికి గాని కాల్ చేసి సమాచారం అందించాలని అవగాహనా కల్పించటం జరిగింది. కేజీబివి ప్రిన్సిపాల్ సునీత బాలలకు సంబంధించిన విషయాలు వివరించిన షేర్ ఎన్జీఓ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి చైల్డ్ మరియు ఉమెన్స్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో షేర్ ఎన్జీఓ ప్రతినిధులు ప్రశాంతి, గాయత్రి ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.