ఛాంపియన్స్ ట్రోఫీ: ఆతిథ్య పాక్ కు తొలి మ్యాచ్ లోనే అదిరిపోయే టార్గెట్

V. Sai Krishna Reddy
1 Min Read

నేడు ప్రారంభమైన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో తొలి మ్యాచ్ లో ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. కరాచీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్… న్యూజిలాండ్ కు బ్యాటింగ్ అప్పగించింది.

అయితే, విల్ యంగ్ (107), టామ్ లాథమ్ (118 నాటౌట్) అద్భుత సెంచరీలు సాధించడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 320 పరుగులు చేసింది. కివీస్ జట్టులో గ్లెన్ ఫిలిప్స్ 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు చేశాడు. విల్ యంగ్ 113 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. లాథమ్ 104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో అలరించాడు. పాక్ బౌలర్లలో నసీమ్ షా 2, హరీస్ రవూఫ్ 2, అబ్రార్ అహ్మద్ 1 వికెట్ తీశారు.

అనంతరం, 321 పరుగుల భారీ లక్ష్యఛేదనలో పాకిస్థాన్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సాద్ షకీల్ 6 పరుగుల స్కోరుకే వెనుదిరిగాడు. ప్రస్తుతం పాక్ స్కోరు 4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 8 పరుగులు. బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ క్రీజులో ఉన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *