దూసుకుపోతున్న కాంగ్రెస్

V. Sai Krishna Reddy
4 Min Read

ఆదిలాబాద్ జిల్లాలో హోరా హోరీగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్ర చారం

ఆత్మ విశ్వాసం లో బిజెపి

దూసుకుపోతున్న కాంగ్రెస్

ఎమ్మెల్సీ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొలది ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్ర చారం జోరందుకుంటుంది. భా రతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టా నం ముందే ప్రకటించి నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా అభ్య ర్థులను ప్రకటించి రంగంలోకి దింపింది. అయినప్పటికీ నా మినేషన్ల ఘట్టం ముగిసి పోవ డం వల్ల అభ్యర్థులు ప్రచారం లో మునిగి తేలీ యాడుతు న్నారు. తమదైన రీతిలో దూ సుకుపోతున్నారు. అదిలాబా ద్, కరీంనగర్, మెదక్, నిజామా బాద్, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థా నం కోసం హోరా హోరీగా పో రు జరుగుతుంది.పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డి తనదైన రీతిలో విస్తృతం గా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పశ్చిమ భాగంలో బిజెపి పార్టీకి నాలుగు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో తమ కు మెజారిటీ ఓట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉ న్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, సిర్పూర్, అసెంబ్లీ నియోజక వర్గాల్లో బిజెపి ఎ మ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. అంతేకాకుండా ఈ నా లుగు అసెంబ్లీ నియోజక వర్గా లు కూడా ఆదిలాబాద్ పార్ల మెంటు పరిధిలో ఉండడం వ ల్ల పార్లమెంట్ సభ్యుడు కూడా బిజెపికి చెందిన వారు ఉండ డంవల్ల ఆ పార్టీ మరింత ధీ మాతో ముందుకు దూసుకు పోతుంది. పశ్చిమ జిల్లాలో ఒ కే ఒక స్థానానికి పరిమిత మైన కాంగ్రెస్ పార్టీ సైతం తమ దైన రీతిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్ర చారంలో దూసుకుపోతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి తనదైన రీతి లో ఎన్నికల ప్రచారం నిర్వహి స్తున్నారు. పట్ట భద్రులను ఆక ట్టు కునే విధంగా విస్తృత కార్య క్రమాలు నిర్వహిస్తున్నారు. తూర్పు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు నలుగురు ఉండ డం వల్ల ఆప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఓట్లు తప్పకుం డా వస్తాయన్న ధీమాతో ఉన్న ప్పటికీ పశ్చిమ జిల్లాలో కూడా ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ బాధ్యత పూర్తిగా అసెంబ్లీ ని యోజకవర్గాల ఇన్చార్జిలపై నె ట్టివేయడంతో నియోజకవర్గ ఇన్చార్జీలు తమదైన రీతిలో ఒక పట్టుదలతో ముందుకు దూ సుకెళ్తున్నారు. తూర్పు జి ల్లాలో బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు అసెంబ్లీ నియోజక వర్గంలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మె ల్యే లు ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. అభ్యర్థి గెలుపు లక్ష్యం గా పట్ట భద్రులను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలి పించాలంటూ అభ్యర్థిస్తున్నా రు. ఇటీవల ఆదిలాబాద్ లో నిర్వహించిన ఆత్మీయ స న్మా న సభకు పెద్ద ఎత్తున పట్టభ ద్రులు హాజరయ్యారు. ఈ స మావేశానికి ఇన్చార్జి మంత్రి సీ తక్కతో పాటు ఖానాపూర్ ఎ మ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్, తో పాటు ఇటీవలే బిఆర్ ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరిన మాజీ మంత్రులు పాల్గొ న్నారు. అసెంబ్లీ నియోజకవర్గా ల ఇన్చార్జీలు తూర్పు ప్రాంతం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మె ల్యేలు హాజరయ్యారు. తూర్పు ప్రాంతంలో తప్పకుండా మెజా ర్టీ ఓట్లు సాధిస్తాం అన్న నమ్మ కంతో ఆ పార్టీ నేతలు ఉన్నా రు. అయితే పశ్చిమంలో కూ డా పట్టు బిగించాలన్న పట్టుద లతో ఉత్సాహంగా ముందుకు దూసుకుపోతున్నారు. ఇన్చార్జ్ మంత్రి సీతక్క ఒక సవాల్ గా స్వీకరించి పశ్చిమ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం నిర్వహి స్తున్నారు. ఓటర్లందరిని ప్రస న్నం చేసుకుంటూ తమదైన రీతిలో ప్రచారం నిర్వహిస్తు న్నారు. నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగాగా కాంగ్రెస్ పార్టీ నా యకులు ముందుకు దూసుకు పోతున్నారు. ఆదిలాబాద్ అ సెంబ్లీ నియోజకవర్గంలో కంది శ్రీనివా సరెడ్డి నేతృత్వంలో ప్ర చారం విస్తృతంగా కొనసాగు తుండగా బోథ్ అసెంబ్లీ నియో జకవర్గం లో ఆడే గజేందర్ తనదైన రీతిలో విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా ఖానాపూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ తప్పకుండా పట్టభద్రుల ఓట్లు సాధించాలన్న పట్టుదలతో నియోజకవర్గం నుంచి మెజారి టీ ఓట్లు ఇవ్వాలని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ని ర్మల్ లో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు శ్రీహరి రావు నియోజక వర్గానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తూనే పట్టభద్రులం దరినీ ఏకం చేస్తూ గెలుపే ల క్ష్యంగా దూసుకుపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బిజెపి, కాం గ్రెస్ మద్య పోటా పోటీగా ప్రచారం కొనసాగు తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా కాంగ్రెస్ పార్టీ వైపు పట్టభద్రులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. టిఆర్ఎస్ పార్టీ ఈసారి ఎమ్మె ల్సీ అభ్యర్థిని రంగంలోకి దించ కపోవడంతో ఆ పార్టీ నాయకు ల మద్దతు కూడా కూడగట్టు కుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగడం వల్ల అభివృద్ధి ఇక కాంగ్రెస్ తో నే సాధ్యమని భావించి ఆ పార్టీ నేతలు తమదైన రీతిలో హామీ ల వర్షం గుప్పిస్తూ ఓటర్ల ను ఆకట్టు కుంటున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *