ఎమ్మెల్సీ అభ్యర్థి వంగా మహేందర్ రెడ్డి కి సంపూర్ణ మద్దతు
ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంట అంజయ్య
ప్రజాజ్యోతి నిజామాబాద్ ప్రతినిధి:
కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి, పిఆర్ టియు బలపరిచిన వంగ మహేందర్ రెడ్డి కి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు పెంట అంజయ్య, గౌరవధ్యక్షులు మోతే సాయన్నలు తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వడంతో రాష్ట్ర శాఖ ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ నెల 17న సోమవారం జిల్లాల పర్యటనలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన సందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో సమావేశమై ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుడు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వంగ మహేందర్ రెడ్డి కి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రామచందర్ గైక్వాడ్, అటోలి భూషణ్, రాష్ట్ర కోశాధికారి సుశీల్ కుమార్, బైండ్ల శ్రీనివాస్, ఎన్ రాజు, సవిత, మమత, సౌందర్య, సంతోష్, ముకుంద్ తదితరులు పాల్గొన్నారు.