నేటితో ముగియనున్న నుమాయిష్_
నాంపల్లిలో కొనసాగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ నేటితో ముగియనుంది. వీకెండ్ కావడంతో ఆదివారం సందర్శకులు భారీగా తరలివచ్చారు. ప్రతి స్టాల్ దగ్గర రష్ కనిపించింది. ఈనెల 15తో ఎగ్జిబిషన్ ముగియాల్సి ఉండగా, ఇటీవల అధికారులు 17 వరకు పొడిగించారు. ఆఖరి రోజు కావడంతో సోమవారం సందర్శకుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది.