గతంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ‘మళ్లీరావా .. ఎజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.. మసూద చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఆయన నిర్మించిన ‘బ్రహ్మా ఆనందం’ చిత్రంపై ప్రేక్షకులతో పాటు, సినీ పరిశ్రమలో కూడా ఓ పాజిటివ్ వైబ్ ఉంది. చాలా విరామం తరువాత హాస్య నటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఆయన తనయుడు రాజా గౌతమ్ కీలక పాత్రలో నటించాడు. నిఖిల్ దర్శకత్వంలో నిర్మించిన ‘బ్రహ్మా ఆనందం’, ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో తెలుసుకుందాం.
కథ: చిన్నతనంలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన బ్రహ్మనందం (రాజా గౌతమ్)కి స్కూల్ డేస్ నుంచే నటన అంటే చాలా ఇష్టం. బంధువులకు దూరంగా నాకు నేనే.. నా కోసం నేనే అనే విధంగా ఆలోచిస్తూ స్నేహితుడు గిరి (వెన్నెల కిషోర్)తో కలిసి ఉంటాడు. స్కూల్ డేస్ నుంచి స్టేజ్‌ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం, నటుడిగా తనని తాను నిరూపించుకునే అవకాశం కోసం వేచి చూస్తుంటాడు.
తొమ్మిదేళ్లుగా ఎలాంటి ఉద్యోగం లేకుండా, అప్పులు చేస్తూ జీవనాన్ని గడుపుతున్న బ్రహ్మానందానికి థియేటర్ ఆర్టిస్ట్‌గా నిరూపించుకునే ఓ అవకాశం వస్తుంది. ఇందుకు ఆరు లక్షలు అవసరం పడతాయి. బ్రహ్మానందం ప్రేయసి తార (ప్రియ వడ్లమాని) సాయం చేయాలని అనుకుంటుంది. కానీ అతను తనను ప్రేమించట్లేదని తెలుసుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటుంది. అయితే ఈ సమయంలోనే ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంటున్న తాన తాత బ్రహ్మానందమూర్తి ( బ్రహ్మానందం)ని కలుసుకుంటాడు.
కొన్ని కండిషన్లు పాటిస్తే తన ఆరు ఏకరాల భూమిని అమ్మి డబ్బులు ఇస్తానని తాత మాటిస్తాడు. ఇందుకోసం కొన్ని షరతులు పెడతాడు. బ్రహ్మానందం ఆ కండిషన్లు పాటిస్తాడా? ఆ షరతులు ఏమిటి? బ్రహ్మానందం తన సొంత ఊరుని అని చెప్పి అందరినీ ఇంకో ఊరుకు ఎందుకు తీసుకెళాతాడు? మూర్తి జ్యోతి (రామేశ్వరి)కి ఉన్న సంబంధం ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..