టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ సరికొత్త ఐఫోన్ ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. తాజా ఫోన్ ఎస్ఈ సిరీస్ లో వస్తోంది. దీన్ని ఐఫోన్ ఎస్ఈ4గా పిలుస్తారు. ఫిబ్రవరి 19న తమ ఆపిల్ కుటుంబం నుంచి కొత్త ఉత్పాదన మార్కెట్లోకి రిలీజ్ అవుతోందని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. ఆయన ప్రత్యేకంగా ఐఫోన్ ఎస్ఈ 4 పేరును ప్రస్తావించనప్పటికీ… కొత్తగా లాంచ్ అయ్యే ప్రొడక్ట్ ఇదే అని టెక్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
కాగా, ఐఫోన్ ఎస్ఈ 4 ధర కూడా తక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. ఐఫోన్ కొత్త మోడల్ ఏదైనా లాంచ్ అవుతోందంటే… ఆపిల్ స్టోర్ల ఎదుట వద్ద హంగామా మామూలుగా ఉండదు. అర్ధరాత్రి నుంచే గాడ్జెట్ ప్రియులు ఆపిల్ స్టోర్ల వద్ద బారులు తీరి ఉంటారు