దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఇండియాతో సహా ఇతర దేశాలపై రెసిప్రోకల్ టారిఫ్ లను విధిస్తాననే నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో వారు అమ్మకాలకు మొగ్గుచూపారు.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్… 199 పాయింట్లు నష్టపోయి 75,939కి పడిపోయింది. నిఫ్టీ 102 పాయింట్లు కోల్పోయి 22,929 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (0.90%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.80%), ఇన్ఫోసిస్ (0.71%), టీసీఎస్ (0.60%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.49%).
టాప్ లూజర్స్:
అదానీ పోర్ట్స్ (-4.20%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.47%), సన్ ఫార్మా (-2.40%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.21%), ఎన్టీపీసీ (-2.18%).