విష్వక్సేన్ హీరోగా నటించిన ‘లైలా’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తొలుత 150 మేకలు ఉంటాయని… ఆ తర్వాత 11 మేకలు మాత్రమే మిగులుతాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. సినిమాను బాయ్ కాట్ చేస్తామంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. దీంతో, చిత్ర బృందంతో పాటు పృథ్వీ కూడా క్షమాపణలు చెప్పారు.
తాజాగా ఈ అంశంపై నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ… పృథ్వీ చేసిన వ్యాఖ్యలు చాలా తప్పని అన్నారు. ఒక సినిమా వేడుకకు వచ్చినప్పుడు అలా మాట్లాడకూడదని చెప్పారు. ఎన్నికలు అయిపోయాయని… ఇప్పుడు నువ్వు వచ్చి కొత్తగా ఆ విషయాన్ని చెప్పకూడదని అన్నారు. ఈ విషయంలో అనవసరంగా బలి అయింది విష్వక్సేన్ మాత్రమేనని చెప్పారు. పృథ్వీ విషయంలో ఆయనను టార్గెట్ చేసిన వాళ్లంతా కరెక్టేనని అన్నారు.