ఆసియాలో సంపన్న కుటుంబాలు… టాప్ లో ఎవరంటే..?

V. Sai Krishna Reddy
1 Min Read

ఇందులో భాగంగా… ఆసియాలోనే ధనిక కుటుంబంగా అంబానీ ఫ్యామిలీ నిలిచింది.

ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబాల జాబితా తాజాగా తెరపైకి వచ్చింది. ఈ జాబితాను తాజాగా బ్లూమ్ బెర్గ్ విడుదల చేసింది. ఈ జాబితాలోని టాప్ 20లో ఆరు కుటుంబాలు భారతీయ కుటుంబాలు కాగా.. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది కూడా మనవాళ్లే. ఇందులో భాగంగా… ఆసియాలోనే ధనిక కుటుంబంగా అంబానీ ఫ్యామిలీ నిలిచింది.

అవును… ఆసియాలోనే అత్యంత ధనిక కుటుంబంగా తొలి స్థానంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ ఫ్యామిలీ నిలిచింది. ఆ కుటుంబం దాదాపు రూ.7.86 లక్షల కోట్ల సంపదను కలిగి ఉంది. ఇక రెండో స్థానాన్ని థాయిలాండ్ కు చెందిన చీరవనోండ్ ఫ్యామిలీ సొంతం చేసుకోగా.. వారి ఆస్తి రూ.3.70 లక్షల కోట్లు.

అంటే… ఇప్పట్లో అంబానీ కుటుంబాన్ని ఆసియాలోని మరో ఫ్యామిలీ చేరుకోవడం దాదాపు కష్టమేనన్నమాట. ఇదే క్రమంలో ఈ టాప్ 20 లో మొదటి స్థానంతో పాటు నాలుగు, ఏడు, తొమ్మిది స్థానాల్లో వరుసగా భారత్ కు చెందిన మిస్త్రీ, జిందాల్, బిర్లా ఫ్యామిలీలే ఉన్నాయి. ఆసియాలోని టాప్ – 10 సంపన్న కుటుంబాలు: 1. ముకేశ్‌ అంబానీ కుటుంబం- రూ.7.86 లక్షల కోట్లు (భారత్‌) 2. చీరావనోండ్ కుటుంబం- రూ.3.70 లక్షల కోట్లు (థాయ్‌ లాండ్) 3. హర్టోనో కుటుంబం- రూ.3.66 లక్షల కోట్లు (ఇండోనేషియా)

మిస్త్రీ ఫ్యామిలీ- రూ.3.25 లక్షల కోట్లు (భారత్‌) 5. క్వాక్‌ ఫ్యామిలీ- రూ.3.09 లక్షల కోట్లు (హాంకాంగ్‌) 6. త్సాయ్‌ కుటుంబం- రూ.2.68 లక్షల కోట్లు (తైవాన్‌) 7. జిందాల్‌ ఫ్యామిలీ- రూ. 2.44 లక్షల కోట్లు (భారత్‌) 8. యోవిధ్య కుటుంబం- రూ. 2.23 లక్షల కోట్లు (థాయ్‌ లాండ్‌) 9. బిర్లా ఫ్యామిలీ- రూ. 1.99 లక్షల కోట్లు (భారత్‌) 10. లీ కుటుంబం- రూ.1.97 లక్షల కోట్లు (దక్షిణ కొరియా)

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *