సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఐశ్వర్య రాజేశ్ పెద్ద హిట్ కొట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక విషయాన్ని వెల్లడించింది.
ప్రేమ కంటే అది బ్రేకప్ అయినప్పుడు వచ్చే బాధ తనకెంతో భయమని ఐశ్వర్య తెలిపింది. గతంలో తాను రిలేషన్ లో ఉన్నానని… సినిమాల్లో అడుగుపెట్టిన కొత్తలో ఒక వ్యక్తిని ఇష్టపడ్డానని, అతడి నుంచి వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పింది. రిలేషన్ షిప్ లో ఇలా ఎందుకు జరుగుతుందని భయపడ్డానని తెలిపింది. గత అనుభవాల వల్ల ప్రేమలో పడాలంటే ఎంతగానో ఆలోచిస్తున్నానని చెప్పింది.