ఏపీలోని కూటమి ప్రభుత్వం మద్యం ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలపై 15 శాతం పెంచుతూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, రూ.99కి అమ్మే మద్యం బ్రాండ్లు, బీర్లకు ఈ ధర పెంపు వర్తించదు. మిగతా అన్ని రకాల మద్యంపై… పెంచిన ధరలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
రాష్ట్రంలో మద్యం విక్రయాలపై మార్జిన్ ను ప్రభుత్వం ఇటీవలే 14.5 నుంచి 20 శాతానికి పెంచింది. ఇప్పుడు 15 శాతం ధరల పెంపుతో మందుబాబులకు షాకిచ్చింది. దేశీయ తయారీ ఫారెన్ లిక్కర్, ఫారెన్ లిక్కర్ కేటగిరీ మద్యంపై ఏఆర్ఈటీ (అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్) విధించనున్నారు