హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద రహదారి విస్తరణ పనులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సినీ నటుడు అల్లున్ మామ, కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డికి చెందిన ఇంటి స్థలానికి అధికారులు మార్కింగ్ వేశారు. ఈ నేపథ్యంలో గ్రీన్ లాండ్స్ లోని మహాత్మ జ్యోతిరావు పూలే భవన్ నిర్వహిస్తున్న ప్రజావాణణిలో ఆయన ఫిర్యాదు చేశారు.
రోడ్డు విస్తరణలో భాగంగా తన ప్లాట్ లో ఓ వైపు 20 అడుగులు, మరోవైపు 36 అడుగుల భూమిని సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలంటూ అధికారులను ఆయన కోరారు. కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్క్ చుట్టూ ఉన్న ఆరు కూడళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దీనికోసం రూ. 1,100 కోట్లను కేటాయించింది