త్రిషకి తెలుగు .. తమిళ భాషల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. హీరోయిన్ గా ఇక ఆమె పని అయిపోయిందని అంతా అనుకున్నారు. దాంతో ఆమె లేడీ ఓరియెంటెడ్ కథలను చేస్తూ ముందుకు వెళ్లడం మొదలుపెట్టింది. అయితే గ్లామర్ కాపాడుకుంటూ, మళ్లీ అందరూ తన వైపు తిరిగి చూసేలా చేసుకుంది. అప్పటి నుంచి ఆమె ప్రయాణం మరింత జోరుగా సాగడం మొదలైంది. పెద్ద బ్యానర్లు .. పెద్ద హీరోల సరసన నాయికగా అవకాశాలు సంపాదించుకుంటూ వెళుతోంది.
రజనీకాంత్ .. విజయ్ .. అజిత్ వంటి స్టార్ హీరోలతో ఆమె జోడి కట్టింది. మలయాళంలో టోవినో థామస్ తో కలిసి ‘ఐడెంటిటీ’ సినిమాలోనూ చేసింది. అయితే ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర ఆమెకి విమర్శలను తెచ్చిపెట్టింది. అఖిల్ పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది జనవరి 2వ తేదీన థియేటర్లకు వచ్చింది. రీసెంటుగా ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమా చూసిన తెలుగు అభిమానులు, ఈ పాత్రకి ఓకే చెప్పడం త్రిష చేసిన పొరపాటు అనే అంటున్నారు
.