శివ’ సినిమా చూసినవారికి ‘చిన్నా’ గుర్తుంటాడు. ఆయన అసలు పేరు జితేందర్ రెడ్డి. ‘శివ’ సినిమాతో ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఆయన అనేక సినిమాలో నటించారు. సినిమాలలో అవకాశాలు తగ్గిన తరువాత సీరియల్స్ చేస్తూ వెళ్లారు. ఒకానొక సమయంలో ఆయన బుల్లితెరపై బిజీ అయ్యారు. తాజాగా ఆయన ‘సుమన్ టీవీ’ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఇండస్ట్రీ నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చింది. మంచి మంచి పాత్రలను చేసే అవకాశం వచ్చింది. ఆ తరువాత ఎక్కువగా సీరియల్స్ చేశాను. బుల్లితెర వైపు నుంచి నాలుగు నంది అవార్డులు వచ్చాయి. ఇండస్ట్రీకి వచ్చిన తరువాతనే నాకు వివాహమైంది. మాకు ఇద్దరు అమ్మాయిలు .. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు అమ్మాయిలు మంచి పొజిషన్ లో ఉన్నారు” అని అన్నారు.
మా ఆవిడ చాలా మంచిది .. మంచితనం అంటే ఇలా ఉంటుందని అనుకునేలా ఉండేది. ఇంటికి వచ్చినవారికి భోజనం పెట్టకుండా పంపించేది కాదు. నరాల సంబంధమైన వ్యాధితో ఇబ్బంది పడింది. ఐదారేళ్లు వీల్ చైర్ లోనే ఉండిపోయింది. ఎనిమిదేళ్ల క్రితం నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయింది. ప్రతిరోజూ తన ఫొటో దగ్గర పూలు పెట్టడంతోనే నా దినచర్య మొదలవుతుంది” అని చెప్పారు