GSDP పెరిగితే రాష్ట్ర ఆదాయం ఎందుకు తగ్గింది: జగన్
జీఎస్ఓపీ పెరిగితే రాష్ట్ర ఆదాయం ఎందుకు తగ్గిందని మాజీ సీఎం జగన్ సూటిగా ప్రశ్నించారు. ‘జూన్-డిసెంబర్ మధ్య రాష్ట్ర ఆదాయం రూ.50,544 కోట్లు. ఈ 7 నెలల్లో 0.51శాతం నెగెటివ్ గ్రోత్ వచ్చింది. చంద్రబాబు మాత్రం 13శాతం GSDP ఉందంటూ తప్పుడు నివేదిక ఇచ్చారు. కేంద్ర బడ్జెట్లో చంద్రబాబు సాధించిందేమీ లేదు. దావోస్లో ఒక్క MoU కుదరలేదు. చంద్రబాబు పలుకుబడి ఏంటో అర్థమవుతోంది’ అని జగన్ ఎద్దేవా చేశారు.