ఎస్బీఐలో రూ. 10 లక్షల లోన్.. 12 శాతం వడ్డీపై నెలకు ఎంత ఈఎంఐ కట్టాలో తెలుసా? లెక్కలివే

V. Sai Krishna Reddy
2 Min Read

గత కొంత కాలంగా బ్యాంకుల్లో లోన్లు తీసుకునే వారి సంఖ్య ఎక్కువైందని చెప్పొచ్చు. అత్యవసర సమయాల్లో ఇప్పుడు వేగంగా రుణాల్ని మంజూరు చేస్తున్నాయి బ్యాంకులు. అయితే ఇక్కడ వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండవు. ఇక్కడ లోన్ వడ్డీ రేట్లను బ్యాంకులు.. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లకు (MCLR) ముడిపెడుతుంటాయి. ఎంసీఎల్ఆర్ అనేది ఆర్బీఐ తీసుకొచ్చిన విధానం. ఇక్కడ ఈ ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చేందుకు వీల్లేదు. ఇది కనీస వడ్డీ రేటు అని చెప్పొచ్చు. దీనినే రుణ ఆధారిత వడ్డీ రేట్లుగా చెబుతుంటారు.

బ్యాంకులు కూడా ప్రతి నెలా కీలక వడ్డీ రేట్లను సవరిస్తుంటాయి. ఎక్కువగా ఆర్బీఐ రెపో రేటు నిర్ణయాలకు అనుగుణంగా ఇక్కడ లోన్లపై వడ్డీ రేట్లను మారుస్తుంటాయి. గత కొంత కాలంగా ఆర్బీఐ వడ్డీ రేట్లు స్థిరంగానే ఉంచుతున్న క్రమంలో.. బ్యాంకులు కూడా యథాతథంగానే ఉంచుతూ వస్తున్నాయి. గత నెల ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ రేట్లు సవరించగా.. ఇప్పుడు రూ. 10 లక్షల లోన్‌పై ఈఎంఐ ఎలా పడుతుందో చూద్దాం.కొత కాలంగా బ్యాంకుల్లో లోన్లు తీసుకునే వారి సంఖ్య ఎక్కువైందని చెప్పొచ్చు. అత్యవసర సమయాల్లో ఇప్పుడు వేగంగా రుణాల్ని మంజూరు చేస్తున్నాయి బ్యాంకులు. అయితే ఇక్కడ వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండవు. ఇక్కడ లోన్ వడ్డీ రేట్లను బ్యాంకులు.. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లకు (MCLR) ముడిపెడుతుంటాయి. ఎంసీఎల్ఆర్ అనేది ఆర్బీఐ తీసుకొచ్చిన విధానం. ఇక్కడ ఈ ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చేందుకు వీల్లేదు. ఇది కనీస వడ్డీ రేటు అని చెప్పొచ్చు. దీనినే రుణ ఆధారిత వడ్డీ రేట్లుగా చెబుతుంటారు. ఎంసీఎల్ఆర్ అనేది నెల, 6 నెలలు, ఏడాది, రెండేళ్లు ఇలా వేర్వేరు టెన్యూర్లతో ఉంటాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ .. పర్సనల్ లోన్‌కు ముడిపెట్టి ఉంటుంది. అదే సమయంలో ఏడాది ఎంసీఎల్ఆర్ ఆటో లోన్లకు వర్తిస్తుంది. అంటే ఇక్కడ ఎంసీఎల్ఆర్‌పై కొంచెం అధిక శాతం వడ్డీ విధిస్తుంటాయి బ్యాంకులు. ఇంకా లోన్ అర్హతలో సిబిల్ స్కోరు కీలకంగా ఉంటుంది. మెరుగైన సిబిల్ స్కోరుతో తక్కువ వడ్డీకి లోన్లు పొందే వెసులుబాటు ఉంటుంది.

ఎస్బీఐ గత నెల 15 నుంచి కొత్త ఎంసీఎల్ఆర్ అమలు చేయగా.. ఇది ఫిబ్రవరి 15 వరకు అమల్లో ఉంటుంది. ఈ లెక్కన ఓవర్‌నైట్, ఒక నెల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 8.20 శాతంగా ఉండగా.. 3 నెలల ఎంసీఎల్ఆర్ 8.55 శాతం, 6 నెలలపై 8.9 శాతంగా ఉంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 9 శాతంగా, రెండేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ 9.05 శాతంగా ఉన్నాయి. ఇంకా మూడేళ్ల వ్యవధి ఎంసీఎల్ఆర్ 9.10 శాతంగా ఉంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *