ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్ మెంట్ (ఓపీఎం) ఇచ్చిన బై అవుట్ ఆఫర్ గడువు గురువారంతో ముగియనుంది.
ఏ ప్రభుత్వానికైనా ఉద్యోగులు కళ్లు చెవులు… అయితే ఒక పరిమితికి మించితే మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు.. పరిస్థితులు ప్రతికూలంగా మారితే జీతభత్యాలే గుదిబండ అవుతాయి. వారి రిటైర్మెంట్ బెనిఫిట్లు మరింత మోత మోగుతాయి. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక అనేక సంస్కరణలు అమలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆఫర్లలో ఒకటి.. వాలంటరీ రిజైన్ స్కీమ్. అంటే ఉద్యోగులు వారంతట వారే వైదొలగడం అన్నమాట.
ట్రంప్ ఏ ముహూర్తంలో ఉద్యోగాల కోత నిర్ణయం ప్రకటించారో కానీ.. ఆ వ్యూహం క్రమంగా ఫలితం ఇస్తోంది.