ఇందులో భాగంగా… ఓ విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సాముహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
కంచె చేను మేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. విద్యర్థులకు విద్యాబుద్ధులు చెప్పించి, స్కూల్లో వారికి తల్లితండ్రుల తరహా రక్షణ సైతం కల్పించాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారారు. ఇందులో భాగంగా… ఓ విద్యార్థినిపై ముగ్గురు ఉపాధ్యాయులు సాముహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అత్యంత ఘోరమైన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది
అవును… 30, 40, 50 ఏళ్లు దాటిన ముగ్గురు ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులు 13 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారనే ఘటన తాజాగా తీవ్ర కలకలం రేపుతోంది! దీంతో… సభ్య సమాజం తల దించుకునేలా కూతురి వయసున్న అమ్మాయిపై ఇలా మృగాలుగా మారి ప్రవర్తించిన ముగ్గురు టీచర్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు!