రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కల్పించే 42 శాతం రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ‘చట్ట ప్రకారం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. అలా చట్టప్రకారం 42% ఇవ్వడం సాధ్యం కాకపోతే.. మేం కాంగ్రెస్ పార్టీ తరపున బీసీలకు 42% సీట్లు ఇస్తాం. ఈ అంశానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు సిద్ధమా.’ అని BJP, BRSకి సీఎం సవాల్ విసిరారు.